1. మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చలనుండియే గదా?
2. మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరుకదు.
3. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
4. వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు యీ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
5. -ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?
6. కాదుగాని, ఆయన ఎక్కువ కృపనిచ్చును; అందుచేత-దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.
7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
9. వ్యాకులపడుడి, దు:ఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దు:ఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.
10. ప్రభువు దృష్టికి మిమ్మునుమీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
11. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు.నీవు ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించువాడవైతివి.
12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు; ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
13. -నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,
14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే.
15. కనుక -ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.
16. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.
17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
Download Audio File

No comments:
Post a Comment